- క్రైస్తవ సంఘాల డిమాండ్..
- శాంతియుత కొవ్వత్తుల ప్రదర్శన.
మెట్‌పల్లి, ముద్ర: క్రైస్తవ సువార్తికుడు పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో పట్టణంలోని అంబేద్కర్ పార్క్ లో అంబేడ్కర్ విగ్రహం వద్ద కోరుట్ల నియోజకవర్గ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి చెంది మూడు రోజులవుతున్న ఆంధ్ర పోలీసులు ఇప్పటికి ఎటువంటి ఆధారాలు సేకరించక పోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు. పక్కాగా హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని,ఒక పూజరిని చెంప దెబ్బ కోడితేనే రాజకీయ నాయకులు మానవ హక్కుల సంఘాలు గోలచేస్తే, ఒక క్రైస్తవున్ని అతి దారుణంగా హత్య చేస్తే ఏ ఒక్క నాయకుడు స్పందించ లేదని మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న క్రైస్తవులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒకేసారి క్రైస్తవులందరు రోడ్డుపైకి వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలని వారి జోలికి రావద్దన్నారు. ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి, అనాధ పిల్లలను చేరదీసి విద్యానందిస్తున్న ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపాలని, ఏపీ పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ హత్యే అని, ఇప్పటికైనా ప్రవీన్ పగడాల ను హత్య చేసిన దోషులును పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.కార్యక్రమంలో క్రిస్టియన్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు శామ్యూల్ నాయక్, ప్రధాన కార్యదర్శి బ్రదర్ బొద్దురి సతీష్, ఉపాధ్యక్షుడు ఎలియా మెంగు,గౌతమ్,డాక్టర్ జాకబ్ కిరణ్, కోశాధికారి గిద్యోను,రాజా,బలిపీఠం,అపొస్తలు,ప్రభాకరరావు,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.