Take a fresh look at your lifestyle.

నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉంటాం-బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏనుగు రాజిరెడ్డి…

 

ముద్ర,కుషాయిగూడ

ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులు తమ చదువును మధ్యలో ఆపకుండా తమ వంతు ఆర్ధిక సహకారం అందజేస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి కిషన్ మోర్చా అధ్యక్షులు ఏనుగు రాజిరెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఓరగంటి బాలరాజు, స్వాతి దంపతుల కుమార్తె ఓరగంటి యామిని రాంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతూ పదవ తరగతిలో 530 మార్కులు సాధించి కీసర మండలంలో మొదటి ర్యాంక్ సాధించింది.విషయం తెలుసు కున్న బీజెపి నేత ఏనుగు రాజిరెడ్డి ఈ విద్యార్థిని తో పాటు ఆమె తల్లిదండ్రులను సన్మానించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆమె విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ ఇంటర్ కాలేజ్‌కు సంబంధించిన పూర్తి ఫీజును తానే భరిస్తానని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ, యామిని చదువుకు తాను పూర్తిగా బాధ్యత తీసుకుంటానని, ఆమె ఉన్నత చదువులు పూర్తయ్యే వరకు అండగా నిలుస్తానని తెలిపారు. యామిని భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించి, రాంపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాగారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్ గారు, ఉపాధ్యక్షులు రామారం గిరి గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థులను ఆదుకొని ఉన్నత చదువులకు సహకరిస్తున్న ఏనుగు రాజిరెడ్డి లాంటివారి సేవలు మర్చిపోలేని లబ్ధిదారులతోపాటు స్థానికులు కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.