ముద్ర, కరీంనగర్ :
అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి విజయాల నేపథ్యంలో కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు.
ఈ సంబరాల్లో కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొని కార్యకర్తలతో కలిసి ఉత్సాహాన్ని పంచుకున్నారు. అలాగే కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కూడా బీజేపీ నేతలు వేడుకలు నిర్వహించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు స్వీట్లు తినిపిస్తూ కార్యకర్తలు “జై మోదీ, జై బీజేపీ” అంటూ నినాదాలు చేశారు. మరోవైపు బీజేపీ మహిళా మోర్చా నేతలు బ్యాండ్ మేళం వాయిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.
మొత్తంగా బీజేపీ విజయాలతో కరీంనగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.