Take a fresh look at your lifestyle.

ఆపరేషన్ సింధూరుకు కేంద్ర ప్రభుత్వనికి రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటాం

  • ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
  • ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ప్రభుత్వ విప్పు అల్లూరి ఆధ్వర్యంలో ర్యాలీ.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఆపరేషన్ సింధూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆధ్వర్యంలో  రాజకీయ పార్టీలకు అతీతంగా శుక్రవారం  ధర్మపురి పట్టణంలోని స్థానిక నంది చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు జాతీయ జెండాలను పట్టుకొని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  సంఘీభావ ర్యాలీనీ నిర్వహించారు.

  • అనంతరం లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ..

పహల్గాంలో అమాయక భారతీయులను పాకిస్తాన్ తీవ్రవాదులు కాల్చి చంపిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన సైనిక చర్యకు ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేయడం జరిందన్నారు. కేంద్ర ప్రభుత్వనికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటామని,తీవ్రవాదులను పోషించుకుంటూ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే విధానంగా సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన సైనిక చర్యను హర్షిస్తున్నామన్నారు. భారత దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వనికి మేము అండగా ఉంటామని,వారు ఎటువంటి చర్యలు తీసుకున్న దానికి మా మద్దతు ప్రకటిస్తామని,భారత దేశం వైపు కన్నెత్తి చూడటానికే పాకిస్థాన్ కి వెన్నులో వణుకు పుట్టే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.