Take a fresh look at your lifestyle.

వాటర్షెడ్ యాత్రను ప్రారంభించిన డిఆర్డిఓ

  • డీకే ఉప్పునుంతల గ్రామంలో జండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన చిన్న ఓబులేష్ డి ఆర్ డి ఓ.

అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలోని బీకే ఉప్పునుంతల గ్రామంలో వాటర్ షెడ్ యాత్రను డిఆర్డిఓ, చిన్న ఓబులేసు జెండా ఊపి ప్రారంభించారు.ఈవాటర్షెడ్ యాత్రలో భాగంగా ర్యాలీ నిర్వహించి గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాటర్ షెడ్ ప్రాముఖ్యతను, పండ్ల తోటల ప్రాముఖ్యతను పశుగ్రాసం,పశువులఅభివృద్ధి ప్రాముఖ్యతను ,వాటర్ షెడ్ నిల్వ చేసుకునే కట్టడాల ప్రాముఖ్యతను గురించి గ్రామసభలో అందరికీ తెలియజేశారు. డి ఆర్ డి ఓ చేతుల మీదుగాకొత్త పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నిర్వహించిన పనులు అన్నింటిని జాతికి అంకితం చేశారు.ఈ కార్యక్రమంలో చిన్న ఓబులేష్ DRDO, ఉద్యానవ నాధికారి జగన్, జ్ఞాన శేఖర్ ADH, డిఆర్ఓ వాణి కుమార్ ,ఎఫ్ఆర్ఓ వీరేశ్ ,కృషి విజ్ఞాన కేంద్రం పాలెం నుంచి శ్రీ రామకృష్ణ agronomy, వాటర్ షెడ్ పిఓ క్రాంతి, కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అందరూ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.