Take a fresh look at your lifestyle.

అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి

  • అదనపు కలెక్టర్ డి.వేణు.

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.గోదావరిఖని ఎన్టీఆర్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త బి. వంశీ కృష్ణ గోదావరిఖనిలో గల్లీకి ఒక్క బెల్టు షాపు కొనసాగుతుందని, ఆర్టిఐ లో తనకు తప్పుడు సమాచారం అందించారని, మున్సిపల్ కార్పొరేషన్ పర్యాటక కేంద్రాలు పర్మిట్ రూమ్ లు ఉండకూడదు అనే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రామగుండం కార్పొరేషన్ పెద్దపల్లి మంథని సుల్తానాబాద్ మున్సిపాలిటీలో వైన్ షాపులకు అనుబంధంగా భారీ విస్తీర్ణంలో పర్మిట్ రూములు ఏర్పాటు చేశారని, బెల్ట్ షాప్ లోను నిర్మూలించడంతోపాటు తప్పుడు సమాచారం అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా అభ్కారి శాఖ అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.రామగుండం నగరం ఇందిరానగర్ కు చెందిన కల్లూరు వెంకటి తనకు తన ఇద్దరు ఆడపిల్లలు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీవో కు రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.పెద్దపల్లి పట్టణానికి చెందిన బృందావన్ కాలనీ వాసులు తమ నివాసాల సమీపంలో ఉన్న రైస్ మిల్స్ బూడిద దుర్వాసన వెదజల్లే పొగను వ్యర్థ జలాలను నిర్లక్ష్యంగా విడుదల చేస్తున్నాయని, దీనివల్ల బృందావన్ కాలనీలో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, తమ సమస్యకు పరిష్కారం చూపాలని కొరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీవో కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.