వికారాబాద్, ముద్ర ప్రతినిధి:వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన ఖరారైంది.
- పర్యటన వివరాలు:
1)ఉదయం 9:00 గంటలకు
బంజారాహిల్స్ లోని క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరుతారు.
2)ఉదయం 9:30 గంటలకు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉమ్మడి రంగారెడ్డీ జిల్లా ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తో కలిసి బయలుదేరుతారు.
ఉదయం 11:00 గంటలకు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం
యాలాల మండలం జుంటుపల్లి లోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.
11:15 గంటలకు :జుంటుపల్లి లో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన సముదాయానికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
11:30 గంటలకు:దౌలాపూర్ లో తాండూర్ పట్టణ, అలాగే బెల్కటూర్, నారాయణపూర్ (తాండూర్ రూరల్) హాజీపూర (యలాల్) కొండాపూర్, పాషా పూర్ (పెద్దేముల్) మండలాలకు సంబంధించి ఆరు 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
3) మధ్యాహ్నం12:40 నుండి 2:00 గంటలకు
నూతన రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేసి, తాండూరు నియోజకవర్గం పెద్దెముల్ మండలం కందనెల్లి వద్ద ఉన్న జిపిఆర్ గార్డెన్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.