గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారు * సిపిఐ నాయకులు వి. ఎస్ .బోస్*
ముద్ర కాప్రా
భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డీజిల్ పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ లో నిరసన నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు వి.ఎస్ .బోస్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అనేక తప్పుడు వాగ్దానాలు చేస్తూ గ్యాస్ సిలిండర్ పెట్రోల్ ధరలు పెంచబోమని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలు అయిపోయిన వెంటనే కమర్షియల్ సిలిండర్ ధరలను ఎన్నడు లేని విధంగా 993 రూపాయలు పెంచడమే కాకుండా గత ఆరు నెలల కాలంలో ఆరుసార్లు పెంచడం జరిగిందని,ఉద్యోగాలు లేక చిన్నచిన్న టీ స్టాల్,టిఫిన్ సెంటర్,హోటల్ లు నడుపుకుంటున్న నిరుద్యోగ యువత పై సిలిండర్ల ధరల ప్రభావము తీవ్రంగా పడింది. అనేక టీ స్టాళ్ళు టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి, ఆయా కుటుంబాలు రోడ్ల పడ్డాయి.
హోటల్స్ రెస్టారెంట్లలో సిలిండర్ ధర పెరగడం మూలంగా ఆహార పదార్థాల రేట్లను పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా పరోక్షంగా ప్రజలపై పన్ను వేయడమే కాకుండా దోచుకోవడమే అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్రావు, టి. సత్య ప్రసాద్, కే ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.