Take a fresh look at your lifestyle.

తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్తాం

 

ముద్ర నడిగూడెం…

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై చేస్తున్న ఆరోపణలు అర్థరహితం అని నడిగూడెం మండల టిఆర్ఎస్ సమన్వయ నాయకులు అనంతల ఆంజనేయులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య క్లీన్ ఇమేజ్‌ను దెబ్బతీయడమే ధ్యేయంగా గ్రామ స్థాయి నేతలు నోరు పారేసుకోవడం హాస్యాస్పదం అని , సీఎంఆర్ఎఫ్ నిధులలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే అన్న సంగతి మర్చిపోవద్దు అని దమ్ముంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిజాలు తేల్చాలని తప్పుడు ఆరోపణలతో బురద చల్లడం ఆపండి అని అన్నారు. ఒక దళిత యువకుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది కాంగ్రెస్ నాయకులే అని రాజేష్ మరణానికి అసలు కారణం ఏమిటో, ఎవరి ఒత్తిళ్ల వల్ల అతను ఇబ్బంది పడ్డాడో నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు అని గత ఏడాది కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి పాత విషయాలను, స్కామ్‌లను తెరపైకి తెస్తున్నారు.
కోదాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందాయి అని మల్లయ్య ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇలాంటి చౌకబారు విమర్శలు చెరపలేవు.
మల్లయ్య విజ్ఞత గురించి మాట్లాడే ముందు, మీరు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం చేశారో చెప్పండి. తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. రాజేష్ మరణానికి బాధ్యులు ఎవరో కాలమే నిర్ణయిస్తుంది, అంతవరకు ఈ శవ రాజకీయాలు కట్టిపెట్టండి.”అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దున్న సుధాకర్ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి మేకల గంగరాజు మండల నాయకులు బొల్లం శ్రీనివాస్ నల్లమాద నారాయణరావు వల్లెపు శ్రీనివాస్ ఉద్యమ నాయకులు మహమ్మద్ రఫీ నడిగూడెం గ్రామ కార్యదర్శి కాసాని సతీష్ యూత్ నాయకులు మేకల వీరబాబు అమర బోయిన సైదారావు పోలె బోయిన నాగరాజు శ్రీరాముల శేషు చరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.