ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: కెపిహెచ్‌బి ఎంఆర్‌ఓ కార్యాలయం వద్ద బీజేపీ భారీ ధర్నా
ముద్ర కూకట్‌పల్లి :
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్‌బి ఎం.ఆర్.ఓ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
”కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మిగిలి ఉన్న 999 రోజులు కూడా వాగ్దానాలను నెరవేర్చకుండా కేవలం కాలక్షేపం చేయడానికే పరిమితమవుతోంది. ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలి.”
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మాధవరం కాంతారావు, కూకట్‌పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాంజల పద్మయ్య, కెపిహెచ్‌బి కంటెస్టెంట్ కార్పొరేటర్ ప్రీతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు