సాంఘిక శాస్త్రంలో నూటికి నూరు మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం ముఖ్యఅతిథిగా డివో రమేష్ కుమార్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లాలోని గవర్నమెంట్ హైస్కూల్లో ఈరోజు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సోషల్ పోరం మరియు క్లాస్ మెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి సాంఘిక శాస్త్రం (సోషల్) సబ్జెక్టులో నూటికి నూరు మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా డా. ప్రపుల్ చంద్రా రెడ్డి, డా. రమేష్ చంద్ర, తిరుమల ఎలక్ట్రికల్ సంస్థకు చెందిన టి. జనార్దన్, ఎన్‌ఆర్‌ఐ కె. జ్యోతి కిశోర్‌ల సహకారంతో ప్రతి విద్యార్థికి రూ. 1,116 నగదు పురస్కారం అందజేశారు. అలాగే విద్యార్థులను ఉత్తమ ఫలితాలకు దారితీసిన సోషల్ టీచర్‌ను ప్రత్యేకంగా సన్మానించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ ఏ. రమేష్ కుమార్ విద్యార్థులను అభినందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ వాస రాఘవేంద్ర రాఘవేందర్, జిల్లా సోషల్ పోరం అధ్యక్షుడు కృష్ణమోహన్, ప్రతినిధులు సువర్ణ, కెపీ ప్రసాద్, చంద్రశేఖర్, రాములు, నిరంజన్, ఎల్. వేణుగౌడ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.