Take a fresh look at your lifestyle.

అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక చేస్తే కఠిన చర్యలు

  • నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : ఇందిరమ్మ గృహాల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని , అర్హులైన వారికె ఇండ్లు మంజూరు చేయాలని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతి పేటలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని, లింగసానిపల్లి లో మంచినీటి సరఫరా పై మిషన్ భగీరథ సంపు హౌస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో మాట్లాడారు.నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా పటిష్ట ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నామని ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తుందని అన్నారు. సిమెంటు ధర మార్కెట్ కనుగుణంగా అందించాలని, ఎవరైనా అధిక ధరలకు అమ్మిన , ఇంటిని నిర్మించే మేస్త్రీలు అధికంగా డబ్బులు అడిగిన కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. త్రాగునీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు మిషన్ భగీరథ అధికారులు మండల పరిషత్ జిల్లా పరిషత్ పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేసి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. త్రాగు నీటి సరఫరా కోసం సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నందున మిషన్ భగీరథ ద్వారానే ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.మిషన్ భగీరథలో అందుబాటులో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది షిప్టుల వారిగా 24 గంటలు పని చేస్తూ డిమాండ్ మేరకు అవసరమైన నీరు గ్రామీణ ప్రాంతాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో ప్రతి ఇంటికి ప్రణాళిక బద్ధంగా నీటి సరఫరా చేయాలని , నీటి సరఫరా లో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరించాలని అన్నారు. అనంతరం రఘుపతి పేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యాన్ని, రీజిస్టర్లు పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని . లారీల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. తేమ శాతం రాగానే కొనుగోలు చేసి లారీల ద్వారా మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. . రైస్ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ధాన్యం కొనుగోలు సమర్థ నిర్వహణకు తగు సూచనలు సలహాలు అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో వెంకట్ రాములు, హౌసింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.