రామకృష్ణాపూర్, ముద్ర : స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియంలో క్రీడాకారుల ఆధ్వర్యంలో ఈనెల 10,11 తేదీలలో ఆర్ఆర్ మెమోరియల్ (ఇన్విటేషన్) వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో టోర్నమెంట్ కు సంబంధించిన పోస్టర్లను పట్టణ ఎస్సై రాజశేఖర్,మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,గాండ్ల సమ్మయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆర్గనైజర్స్ మాట్లాడుతూ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు చెప్పారు. బెల్లం శ్రీను,దుబ్బ శ్రీను, కుమార్, నాగులు,రాజేశం తదితరులు పాల్గొన్నారు.