పహల్గామ్ దాడి జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. నేడు తెల్లవారు జామున 1:44 గంటల ప్రాంతంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌లో పేరుతో పాకిస్తాన్, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. బహావల్‌పూర్‌లోని మసూద్ అజార్ రహస్య స్థావరం సహా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం బాంబు దాడి చేసింది. ఈ క్షిపణి దాడిలో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మద్దతు ఉన్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థల స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయని సమాచారం. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక శిక్షణా శిబిరాలు (మర్కజ్) లాంచ్ ప్యాడ్‌లు ప్రస్తుతం పాక్ సైనిక స్థావరాలకు సమీపంలో నడుస్తున్నాయి. భారతదేశంకు వ్యతిరేకంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నడుపుతున్న 9 స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వర్గాలు నిర్ధారించాయి.