Take a fresh look at your lifestyle.

వైభవంగా జగన్నాథ రథయాత్ర

  • ప్రత్యేక పూజలు చేసిన పి ఎస్ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.

ముద్ర , శేరిలింగంపల్లి , విలేకరి: చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాంనగర్ కాలనీ ఆర్ ఎస్ బ్రదర్స్ షో రూమ్ జాతీయ ప్రధాన రహదారి పై ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ మియాపూర్ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి ఎస్ సి చైర్మన్ ఆరోగ్య గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముడి నామస్మరణతో నగరం పులకరించింది. జగన్నాథ రథయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మికతను ద్విగుణీకృతం చేసిందని.జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది. హరే కృష్ణ.. హరే రామ భజనలు, నృత్యాలతో భక్తులు పారవశ్యం చెందారు అని వివిధ దేశాల ఇస్కాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. వివిధ మఠాల పెద్దలు పాల్గొని కృష్ణ భజనలు, కీర్తలను ఆలపించారు. కోలాటాలు, నృత్యాలు చేస్తూ రథ యాత్ర కొనసాగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, మర్రపు గంగాధర్ రావు ,శాభక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.