Take a fresh look at your lifestyle.

శిల్పారామంలో లో ఆకట్టుకున్న సంస్కృతిక కార్యక్రమాలు

ముద్ర, శేరిలింగంపల్లి- విలేకరి: వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం నాడు మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చెన్నై నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి కుమారి స్మ్రితి విక్రమ్ తన ప్రదర్శనలో పుష్పాంజలి, మయూర అలరిపు, శివ స్తుతి, అభంగ్ , తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో శ్రీ నృత్య అకాడమీ ప్రత్యుష శిష్య బృందం చే కూచిపూడి నృత్యంశంలో స్వరపల్లవి, వినాయక కౌతం, ఇందరికి అభయములిచ్చు, భజమానస, రామాయణ శబ్దం, జయము జయము, జతిస్వరం, తిల్లాన అంశాలను శివాని, సాన్విత సాయి, సాత్విక, అనన్య సాయి, అపూర్తి, సాన్విక, శ్రీజీవిత, హంసిక, సహస్ర, ధ్రితి, నిత్య, నేహా, ఐశ్వర్య, హాసవిత, దుర్గ, హిమశ్రీ మొదలైన వారు ప్రదర్శించి ప్రజలను ఎంతగానో మెప్పించారు.

Leave A Reply

Your email address will not be published.