ఆత్మకూర్(ఎం), ముద్ర:
స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ఎన్నిక సోమవారం దేవాలయంలో మాజీ చైర్మన్ గుండేగాని అయిలయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గా పైళ్ల దామోదర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, పాలకమండలి సభ్యులుగా తవిటి వెంకటేశ్వర్లు, సూరారం రాము, గడ్డం హరీష్, ఎలిమినేటి ఎలేందర్, మజ్జిగ రాంబాబు, గంగారపు రాజు, ఎలగందుల శ్రీను, బండారి సాయి, ఇంజమూరి నర్సింహా, ఎలిమినేటి దామోదర్ రెడ్డి, రాచమల్ల సత్తయ్య, కందడి వెంకట్ రెడ్డిని ఏకగ్రీవం అయ్యారు. అనంతరం గత పాలకమండలి, నూతన పాలకమండలి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్, ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్, మాజీ సర్పంచ్ లు బీసు చందర్ గౌడ్, జన్నాయి కోడె నగేష్, అఖిల పక్ష నాయకులు యాస లక్ష్మారెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, యాస ఇంద్రా రెడ్డి, గజరాజు కాశీనాథ్ , దిగోజు నర్సింహా చారి, కోరే భిక్షపతి, యాస బుచ్చి రెడ్డి, రచ్ఛ గోవర్ధన్, పోతగాని మల్లేశం గౌడ్, మజ్జిగ నర్సయ్య, సుల్తాన్ పురుషోత్తం, లోడి వెంకటయ్య, ఎద్దు వెంకటేశ్వర్లు, బండారు సత్యనారాయణ, వార్డ్ మెంబర్లు, అఖిల పక్ష నాయకులు, పాత్రికేయులు, మాజీ డైరెక్టర్ లు, మాజీ చేర్మెన్ లు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.