ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ బ్రాహ్మణులను, అర్చకులను, హిందూ ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో భువనగిరి వినాయక చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షులు జోషి పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ శాసనసభ్యులుగా ఎన్నుకోబడిన వారికి అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత వారిపైన ఉన్నదని వారు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు యావత్ హిందూ సమాజం ఖండిస్తుందని, హిందువుల పైన గౌరవం లేనప్పుడు సభలకు సమావేశాలకు వారిని పిలవద్దన్నారు. మాటలను వెనక్కి తీసుకున్నట్లయితే రేపు జరగబోయే ఉగాది పంచాంగ శ్రవణ వేడుకలను బహిష్కరిస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు రత్నాపురం బలరాం, నాయకులు పడమటి జగన్మోహన్ రెడ్డి, సురేష్ రెడ్డి, మహమ్మద్, అర్చక సంఘం నాయకులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post
Next Post