Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత,అనాలోచిత నిర్ణయాలు-బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

 

అనుభవ రాహిత్యానికి తోడు మోసపూరిత అబద్ధపు పునాదులపై వెలిసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

 

ముద్ర,కుత్బుల్లాపూర్ :

జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టిసి కార్మికులు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రభుత్వ మొండి వైఖరీ తో ఆత్మహత్య చేసుకున్న ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించి మౌనం పాటించారు.అనంతరం వారు మాట్లాడుతూ….ఆర్టిసి డిమాండ్ లు న్యాయమైన డిమాండ్లు అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పెద్దలు కేసిఆర్ గారు ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేసి గెజిట్ ను రీలీజ్ చేశారని, కానీ ఇప్పటి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఆర్టీసీ విలీన ప్రక్రియను అమలు చేయకుండా కావాలనే నిర్లక్ష్యం చేస్తూ కార్మిక, కర్షకులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
గతంలో రేవంత్ రెడ్డి ఆర్టీసి అంశంలో డిజిల్ పై జిఎస్టీ ఎత్తివేస్తేనే సంవత్సరానికి700 కోట్ల లాభం చేకూరుతుందని చెప్పి దాని అమలును అడ్డుకుని ఆర్టిస్టు కార్మికులతో, కుటుంబాలతో ఆడుకుంటూ ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆర్టిసి కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మహిళలు, యువత ఇలా ఏ ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం పట్ల సంతోషంగా లేరన్నారు. ఇవ్వాల్సిన బకాయిలు అడిగితే మీరు నన్ను కోసుకున్నా నా దగ్గర ఒక్క రుపాయి లేదని అబద్ధాలు మాటలతో కాలం వెల్లదీస్తూ, హైదరాబాద్ లో లేని నగరం సృష్టించేందుకు వేలకోట్లు, మూసి ప్రక్షాళన పేరిట 1.50లక్షల కోట్లు వెచ్చిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ లో రేవంత్ రెడ్డి తన సీటు కాపాడుకునేందుకు ఇప్పటికే 70సార్లు డిల్లీకి మూఠాలు మోస్తూ తన సియం సీటును కాపాడుకుంటూ తను మోజుపడ్డ మిస్ యూనివర్స్ అందాల పోటీలు,తన మోజు తీర్చుకునేందుకు మెస్సీతో కలిసి ఆడే పుట్ బాల్ ఆటలకు వందల కోట్లు వెచ్చిస్తున్నారే తప్ప కార్మికులు,కర్షకులు,రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు.
ఏదేమైనా భారతదేశంలోని అన్ని రాష్ట్టాల్లో సియం హోదాలో ఘోరంగా విఫలమైన సియంగా అఫఖ్యాతిని మూట గట్టుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి.
ఏది ఏమైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని వాగ్దానాల హమీలు నేరవేర్చే వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్, సిఐటీయూ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, మాజీ కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, మంత్రి సత్యనారాయణ, జగన్, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.