– గాంధీ గ్రామ స్వరాజ్యం స్పూర్తితో పల్లెల అభివృద్ధికి కేసీఆర్ పాటుపడ్డారు.
– పదేళ్లలో చౌడారం గ్రామాన్ని అభివృద్ధి లో ఆదర్శం గా నిలుపుకున్నాం…
– చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామం లో గాంధీ విగ్రహా ఆవిష్కరణ, గ్రామం లో సిసి కెమెరాలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
మహాత్ముని స్ఫూర్తి తో కెసిఆర్ హయాంలో లో గ్రామాల కు మహర్థశ వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు..చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామం లో గాంధీ విగ్రహం, గ్రామం లో సిసి కెమెరాలను అయన ప్రారంబించారు.. ఈ సందర్బంగా మాట్లాడుతు. మహాత్మా గాంధీ అహింసా మార్గదర్శి మహాత్మా గాంధీ జీవితం ఒక గొప్ప సందేశమని చెప్పారు.వారు చూపించిన అహింసా, సత్యాగ్రహ మార్గంలోనే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. గాంధీ బాటలోనే కేసీఆర్, యావత్ తెలంగాణ సమాజం స్వరాష్ట్రం కోసం శాంతియుత పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామన్నారు. గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం స్పూర్తితో పల్లెల అభివృద్ధికి కేసీఆర్ పాటుపడ్డారని గాంధీ జి కలలు నిజం చేసారన్నారు. 60ఏళ్లలో చేయని అభివృద్ధి కెసిఆర్ గ్రామాల అభివృద్ధి చేసి గ్రామాల స్వరూపాలను మార్చారని చెప్పారు.పల్లెల్లో తాగునీరు,మిషన్ భగీరథ పల్లె ప్రగతి, గ్రామాల సమగ్ర అభివృద్ధి రైతులకు భరోసా, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారుపదేళ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో చౌడారం గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకొని ఆదర్శం గా నిలుపుకున్నామని, ఐక్యత తో ఉండి మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.. గ్రామానికి ఎల్లప్పుడూ నా సహకారం ఉంటుందన్నారు..