Take a fresh look at your lifestyle.

గాంధీ సరోవర్ నిర్వాసితులకు ఆకర్షణీయ పరిహారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ జరుపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఆదివారం గాంధీభవన్ లో ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బాధితుల డిమాండ్ లను ప్రభుత్వం వింటుందన్న ఆయన నిర్వాసితులు సంతృప్తి చెందేలా పరిహారం ఇస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు నిర్వాసితులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అపార్ట్‌మెంట్‌కు నోటీసులు ఇచ్చామని అక్కడికి వెళ్లి తెగ సానుభూతి చూపిస్తున్నాడని విమర్శించారు. మల్లన్న సాగర్ కోసం 14 గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించినప్పుడు హరీశ్‌రావుకి ఇవి గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు చర్యలతో మల్లన్న సాగర్ బాధితులు అనేక మంది చనిపోయారని ఆరోపించారు. ఒకరు గ్రామం వదలలేక ఇంట్లోనే చితి పేర్చుకుని సజీవ దహనం చేసుకున్న సంఘటనను గుర్తు చేశారు. ఆ సమయంలో పోలీసులను పెట్టి బలవంతంగా గ్రామాల నుండి నిర్వాసితులను ఈడ్చి వేశారని అన్నారు. అందులో హరీశ్‌రావు పాపమే ఉందన్న ఆయన.. ఆ పాపాల భైరవుడు ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నాడని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులపై తమకూ సానుభూతి ఉందనీ వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్వాసితులు ప్రతి పక్షాల వలలో చిక్కోద్దని సూచించారు. ప్రభుత్వంతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. మూసీ ప్రాజెక్టు పై హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. మూసీ ప్రక్షాళన చేయడం వాళ్లకు ఇష్టం లేదని మండిపడ్డారు. మూసీ బాగైతే హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ని గుర్తు పెట్టుకుంటారని బీఆర్ఎస్ భయపడుతోందని విమర్శించారు. గతంలో హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తానని కేసీఆర్ బడాయి కబుర్లు చెప్పారని గుర్తుకు చేశారు. మూసీ కోసం రూ. వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పిన కేటీఆర్.. ఆ నిధులను తానే మేసి… నగర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. సంఘటనలపై స్పందిస్తూ.. రాళ్ల దాడి స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆత్మరక్షణ కోసం ప్రయత్నిస్తే, తిరిగి తమపైనే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటని కౌంటర్ ఇచ్చారు. బాన్సువాడలో 70 మంది బీజేపీ (BJP) కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే, బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన అరాచక ఘటనలను ప్రజలు గుర్తుంచుకోవాలని, రౌడీయిజం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.