Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం – ఎస్టీయూ రాష్ట్ర విద్యా సదస్సులో ప్రొఫెసర్ కాశీం

 

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ప్రొఫెసర్ కాసిం అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూ టియస్) ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలోని సంఘ భవనంలో రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన విద్యా సదస్సులో ప్రముఖ విద్యారంగ,సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ కాశీం ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలలను మూసివేసే ఆలోచన విరమించుకోవాలని, విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని వారు కోరారు. ఎస్టీయూ సంఘం స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పడిన తొలి ఉపాధ్యాయ సంఘం అని కొనియాడారు. ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు విద్యారంగంలో పోటీపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మానవ వనరులతోపాటు, భౌతిక వనరులను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదని, పాఠశాలలకు నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు సృజనాత్మకతతో పాటు గుణాత్మక విద్య అందించడంలో ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణలో ఎస్టీయూ బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉందన్నారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఉమ్మడి ఉద్యమాలకు సంసిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు జి సదానందం గౌడ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, డిఏల సాధన కోసం త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి ఎంఇవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న
సి.ఆర్.టి ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలీ, సంఘ అధికార మాస పత్రిక ఎడిటర్ ప్రసాద్, సబ్ ఎడిటర్ శంకర్ మాతంగి,హెడ్ సెక్రటరీ కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏ.వి.సుధాకర్, శ్రీనివాసరెడ్డి, పోల్ రెడ్డి,రవీంద్ర,రాధా జయలక్ష్మీ,శీతల్ చౌహాన్,నీరజ , శిరీష, అజర్ జహా, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.