Take a fresh look at your lifestyle.

చెరువుల పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యత మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

 

ముద్ర కాప్రా

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా చెరువుల పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కాప్రా సర్కిల్ పరిధిలోని ఉన్న కాప్రా చెరువు పరిసరాల్లో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, పొదలను తొలగించే కార్యక్రమాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి , ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్‌కు చెందిన విద్యార్థులు, పారిశుద్ధ్య , ఎంతమాలజీ విభాగపు సిబ్బంది కలిసి దాదాపు 125 మంది పాల్గొన్నారు. చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను , పొదలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నీటి వనరులను సంరక్షించడం , చెరువులను పరిశుభ్రంగా ఉంచడం ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలు కూడా చెరువుల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డీఈ రవి, సానిటరీ సూపర్వైజర్లు, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈఈ, డీఈలు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, యూబీడీ విభాగపు సిబ్బంది, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.