- బి. సత్య ప్రసాద్.
కోరుట్ల/మెట్పల్లి, ముద్ర విలేకరి: మెట్పల్లి పట్టణంలోని శితిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన కూల్చివేత పనులను మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అకామిడేషన్ ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు 15 రోజులలో తాత్కాలికంగా భవన పనులు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు.ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.ఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు పనులను ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు.ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ ఎంపీడీవో ఎమ్మార్వో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కోరుట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నవోదయ విద్యాలయ భవన పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళ వారం రోజు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భవనానికి సంబంధించిన పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలర్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డోర్స్ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.పూర్తి చేసిన వెంటనే నవోదయ స్కూల్ యాజమాన్యం కు అప్పగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణ చైతన్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
