Take a fresh look at your lifestyle.

డీజీపీ ఆనంద్ కు ఉప్పల్ ఎమ్మెల్యే వినతి

 

ముద్ర కాప్రా

తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ఐపిఎస్ ని, హైదరాబాదులోని డిజిపి ఆఫీసులో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి స్థానిక సమస్యలపై చర్చించారుచర్లపల్లి డివిజన్ లో కోటి 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టబోయే స్టోన్ వాటర్ డ్రైనేజ్ పనులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు ఈ మేరకు డిజిపి సీపీ ఆనందును కు వినతి పత్రం అందజేశారు వెంటనే పనులు ప్రారంభించేందుకు జైల్ శాఖ డీజీ కీ ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రాంతాల్లో వరద నీటి నిల్వ సమస్యలు తగ్గి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

అలాగే, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, నిర్దిష్ట కాలపట్టికలో పనులు పూర్తి చేయడానికి సంబంధిత మున్సిపల్ శాఖ అధికారుల కు సహకరించవలసినదగా జైళ్ల శాఖ అధికారులను ఆదేశించవలసినది కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.