ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు నేతృత్వంలో ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు 2 సీసీఎల్‌లు (CCL) మంజూరు చేయాలని, రెండవ శనివారం, ఆదివారం రోజుల్లో విధులు నిర్వహించిన వారికి ప్రత్యామ్నాయ సెలవులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రమేష్, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, పూర్వాధ్యక్షుడు ఎస్. మురళి పాల్గొన్నారు. అలాగే జిల్లా నాయకులు కరుణాకర్ రెడ్డి, మండల బాధ్యులు బాలస్వామి, సురేష్ బాబు, శేఖర్, నరసింహ తదితరులు హాజరయ్యారు.