Take a fresh look at your lifestyle.

నారాయణపేట పట్టణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

పట్టణ అభివృద్ధి బిజెపి ద్వారానే సాధ్యం

4 వ వార్డు ప్రచారంలో కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్

ముద్ర, నారాయణపేట: నారాయణపేట పట్టణ అభివృద్ధి బిజెపి ద్వారానే సాధ్యమని 4 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వార్డులో సేడం మాజీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ తో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఉన్న జిల్లా పోతుందని ఆరోపించారు. బిజెపిని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామన్నారు.

వార్డు సమస్యల పరిష్కారం బిజెపి ద్వారానే సాధ్యం

పట్టణంలోని 16వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం బిజెపి ద్వారానే సాధ్యమని వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కమలాపూర్ అంబికా శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వార్డు ఓటర్లు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చి వార్డును నెంబర్ వన్ గా అభివృద్ధి చేసుకుందామన్నారు. తప్పనిసరిగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించి ఆదరించాలన్నారు.

మన ఓటు గుర్తు కమలం గుర్తు

21 వ వార్డు ఓటర్లు తప్పనిసరిగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి కమలాపూర్ ప్రభాకర్ ఓటర్లను కోరారు. శనివారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి బిజెపి ప్రభుత్వ సంక్షేమ పథకాలు… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. వాడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని… ఓటు వేసి ఒక అవకాశం కల్పించాలని కోరారు.

10 వ వార్డులో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

కౌన్సిలర్ అభ్యర్థి సిద్ది విశాలాక్షి వెంకట్రాములు

నారాయణపేట మున్సిపాలిటీ పరిధి పదో వార్డులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కౌన్సిలర్ అభ్యర్థి సిద్ది విశాలాక్షి వెంకట్ రాములు అన్నారు. సేడం మాజీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, బిజెపి నాయకులు నాగురావు నామాజీ, వార్డు ఇంచార్జ్ జ్యోతి సాయిబన్న ఆధ్వర్యంలో శనివారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులో నెలకొన్న సమస్యలను దశలుగా పరిష్కరిస్తానన్నారు. పట్టణంలో జిల్లా ఆసుపత్రి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం ఓటర్లు గమనించి బీజేపీనీ ఆదరించాలన్నారు. జిల్లా ఆసుపత్రి ఏర్పాటు కోసం బిజెపి చేసిన ఉద్యమాన్ని ప్రజలు గమనించాలన్నారు.

1 వ వార్డును పట్టణంలో నెంబర్ వన్ గా నిలుపుతా

నారాయణపేట పట్టణంలోని ఒకటో వార్డును నెంబర్ వన్ వార్డుగా తీర్చిదిస్తానని కౌన్సిలర్ అభ్యర్థి సుతారి సత్య రఘుపాల్ అన్నారు. శనివారం ఒకటవ వార్డు పరిధిలో మాజీ కౌన్సిలర్ అనూష చిన్న రఘు తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో టిఆర్ఎస్ అధికారంలో పట్టణంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. కమలం ద్వారానే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజెపి ఎల్లప్పుడు ముందుంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.