అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తా
3 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పోలేమోని పద్మ కృష్ణ
ముద్ర, నారాయణ పేట:
పట్టణంలోని 3 వ వార్డు అభివృద్ధి హస్తం పార్టీతోనే సాధ్యమని వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పోలేమోని పద్మ కృష్ణ అన్నారు. శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వ వార్డు పరిధిలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పేదలకు సన్న బియ్యం, జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ఓటర్లకు తెలిపారు. వార్డు ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వార్డులోని ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానన్నారు.