Take a fresh look at your lifestyle.

వికారాబాద్ జిల్లాలోని అత్యధిక మెజార్టీ సాధించిన బంటు వేణు

 

ముద్ర, తాండూర్: జిల్లాలోనే ఇప్పటివరకు మున్సిపల్ పోరులో ఎవరు సాధించనంత మెజారిటీ 909 తాండూర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి సాధించారు. ప్రత్యర్ధులు ఎవరు కూడా దరిదాపుల్లో రాలేనంత మెజార్టీ వచ్చిందంటే ప్రజల్లో ఆయనపై ఎంత నమ్మకం ఉందో అర్థమైపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా బంటు వేణు మాట్లాడుతూ..ఎంతో నమ్మకంతో, జిల్లాలోని అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించిన 11వ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, అనునిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డ్ అభివృద్ధి కొరకు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో కాలనీని అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.