- భూకబ్జాలు చేసినందుకే బీఆర్ఎస్ నుంచి పంపించారు
- రాష్ట్ర ఫిషరీష్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నప్పుడు కమీషన్ల దందా చేసిన ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళగానే పురాణ పురుషుడయ్యారా? అని రాష్ట్ర ఫిషరీష్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ధ్వజమెత్తారు. గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడే ఈటల భూకబ్జాలు, కమిషన్ల వంటి చర్యలకు పాల్పడుతున్నందుకే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని ఆయన తెలిపారు.
ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లు ఇవ్వందే బిల్లులు ఆపిన చరిత్ర ఈటలకే దక్కుతుందన్నారు. సెక్రటేరియేట్ ను కమీషన్ల అడ్డాగా మార్చింది ఎంపీ ఈటల రాజేందర్ అని ఆయన ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మెట్టు సాయి కుమార్ మాట్లాడారు.. ఈటల రాజేందర్, హరీష్ రావులు ఆర్థికశాఖ మంత్రులు కాకముందే ఆస్తులు ఎంత?, ఆర్ధిక మంత్రులు అయ్యాక అస్తులు ఎంత? అని ఆయన ప్రశ్నించారు. ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం మల్కాజ్ గిరి ప్రజల సమస్యలను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ఆయన నిలదీశారు.