ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత సిద్ధాంతకర్త 1969 నుండి వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడిన మహాత్ముడు అని పేర్కొన్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పని చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్.. తన కల సాకారమవుతున్న తరుణంలోనే ఈ లోకాన్ని వీడి వెళ్లడం విషాదకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చింతల రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు పడాల నరేష్, పొనగంటి రంజిత్, బాసోజు గోవర్ధన్, గాజోజు సంతోష్ కుమార్, సహా కార్యదర్శి శివ నూరి రాకేష్, యూత్ కన్వీనర్ కోరుగంటి సాయి కృష్ణ, కొత్తపెళ్లి రఘు, బాగోజు వెంకటేష్,గుగ్గిళ్ళ రాజేష్, సంకోజు లక్ష్మీనారాయణ, కంచర్ల రాజేష్, అక్క పెళ్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.