Take a fresh look at your lifestyle.

అన్ని వర్గాల తోడ్పాటుతోనే అభివృద్ధి – మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అభివృద్ధి పనుల కోసం అన్నివర్గాలతో కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ఉగాది పండగ పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు మిత్ర మండలి 25వ వార్షికోత్సవంలో భాగంగా నియోజకవర్గంలోని మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సమ్మేళనం, సన్మాన సభ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్, సర్పంచ్ లకు శాలువాలతో సత్కరించారు. అనంతరం మున్సిపల్ వైస్ ఛైర్మెన్ మాట్లాడుతూ కేవలం ఒక సామాజిక వర్గం ఐక్యత వల్ల రాజకీయ ఎదుగుదల కష్టమని, అన్ని సామాజిక వర్గాల తోడ్పాటుతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి సామాజిక వర్గానికి ఓ కుల వృత్తి ఉంటుందని, వారి తోపాటు వారి వృత్తిని ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. కనుక అన్ని వర్గాల వారికి ఆదరణ, గౌరవం ఇవ్వడంలో మున్నూరు కాపులు ముందువరసలో ఉంటారన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అప్పాల మహేష్, ప్రధాన కార్యదర్శి గండ్రత్ రమేష్, ఉపాధ్యక్షులు నలిమెల పోశెట్టి, అయ్యన్నగారి శ్రీనివాస్, కోశాధికారి అదుముల్ల శ్రీనివాస్, ఉప కోశాధికారి అదుముల్ల నరేందర్, ఒడ్నం నరేందర్, కూన చంద్రకాంత్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.