ముద్ర మల్కాజిగిరి
ప్రజా సమస్యలు గుర్తించి బాధ్యతాయుతంగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. బోయినపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలియాబాద్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు శాలువాలతో సన్మానం చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పారదర్శకంగా, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని సూచించారు. అలియాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు దాసరి రవి , యూసుఫ్ బాబా, పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు తుర్కపల్లి వాసులు తదితరులు హాజరయ్యారు.