Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ తోనే మా పోటీ-నిజామాబాద్ ఎంపీ అర్వింద్

కాంగ్రెస్ తోనే మా పోటీ
బీఆర్ఎస్ ను గల్లంతు చేస్తాం
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండదు
నిజామాబాద్ ఎంపీ అర్వింద్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ తోనే ప్రధాన పోటీ ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తాను, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిస్తే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. మంగళవారం ఎంపి రఘునందన్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఆయన అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వివరించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీలో అయినా గ్రూపు రాజకీయాలు, విభేదాలు సర్వసాధారణం అని అర్వింత్ అన్నారు. బీఆర్ఎస్‌లో కుటుంబ గొడవ, కాంగ్రెస్‌లో మంత్రుల కొట్లాటలు కళ్ల ముందే కనబడుతున్నాయని చెప్పారు. ఎంపీ రఘునందర్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కోసం ఇన్‌చార్జులను ఎప్పుడో రంగంలోకి దించామని అన్నారు. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.