ముద్ర ప్రతినిధి,తెలంగాణ బ్యూరో:
రూ.2 కోట్ల 4 లక్షల రూపాయలతో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాం గూడ ,దర్గా వెస్ట్రన్ ప్లాజా కాలనీలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాం గూడ, దర్గా వెస్ట్రన్ ప్లాజా కాలనీలలో రూ. 2 కోట్ల 4 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక మరియు సీసీ రోడ్ల నిర్మాణం పనులకు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం నానక్ రాం గూడ, దర్గా వెస్ట్రన్ ప్లాజా కాలనీలలో రూ. 2 కోట్ల 4 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక మరియు సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, సీసీ రోడ్ల పనులకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని PAC చైర్మన్ గాంధీ గారు అన్నారు.

నానక్ రాం గూడ స్మశాన వాటిక ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని , అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, స్మశాన వాటిక ను సకల సదుపాయాలతో ,అన్ని హంగులతో సుందరవనంగా మరో మహా ప్రస్థానం లాగా చేపట్టడం జరుగుతుంది అని అని, అదేవిధంగా స్మశాన వాటిక లో ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కలిపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అని,మనిషి మరణాంతరం చివరి దశలో అంత్యక్రియలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల వసతుల కలిపించడం జరుగుతుంది అని స్మశాన వాటిక అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని , నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియసారు .

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారి సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని , శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అగ్రభాగాన నిలబెడుతామని PAC చైర్మన్ గాంధీ గారు తెలిపారు.
సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని PAC చైర్మన్ గాంధీ గారు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ గారు అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ గారు చెప్పడం జరిగినది.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, గచ్చిబౌలి డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ గారు పునరుద్ఘాటించారు.
శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :
మంజూరైన అభివృధి పనుల వివరాలు
1.నానక్ రాంగుడా లో రూ. 80 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి మరియు సుందరీ కరణ పనులకు *
2.దర్గా వెస్ట్రన్ ప్లాజా కాలనీ లో రూ. 124 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు *
పైన పేర్కొన్న స్మశాన వాటిక అభివృద్ధి పనులకు మరియు సీసీరోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు