Take a fresh look at your lifestyle.

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నిర్మాణానికి నిధులు కేటాయించండి… పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు వినతి…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి జగిత్యాలలో సర్వేనెంబర్ 218 ధరూర్ క్యాంపులో కేటాయించిన ఒక ఎకరం స్థలంలో కార్యాలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను డిసిసి అధ్యక్షులు నందయ్య కోరారు. ఈ మేరకు సోమవారం పీసీసీ అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లా లో కార్యాలయం ఏర్పాటు కు ఏర్పాట్లు జరుగుతున్నాయని,
స్థలం ఎంపిక కాగానే కార్యాలయం నిర్మాణానికి అవసరం అయ్యే నిధులు కేటాయించి, పార్టీ కార్యాలయం నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని, తొందరలోనే జగిత్యాలలో కార్యాలయం ఏర్పాటుకు అవసరం అయ్యే నిధులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజెంగి నందయ్య, పీసీసీ సెక్రటరీ బండ శంకర్, పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గుంటి జగదీశ్వర్, పీసీసీ సేవాదళ్ సెక్రటరీ ముకేశ్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.