Take a fresh look at your lifestyle.

కలెక్టరేట్లో మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం, న్యాయం, ధర్మం వంటి విలువలను ప్రచారం చేసిన మహనీయుడు అని ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి, బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.
అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, కార్యదర్శులు, అధ్యక్షులు, తదితరులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాహితీ ,గౌడ కమ్యూనిటీ సభ్యులు, ఇతర కుల సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.