Take a fresh look at your lifestyle.

పసుపులేటిలో పాతరాతియుగం పనిముట్లు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న హరిద్రానది(పసుపులేరు) పురజీవన సంస్కృతి, నాగరికతల జీవవాహిక మంజీరానదిలో పురావస్తుపరిశోధనలు జరిపిన డిఎల్లెన్ శాస్త్రివంటి పరిశోధకులు ఇక్కడ పురామానవుల జీవనవిధానంలో వివిధ రాతియుగాల నాగరికతను వెలుగులోనికి తెచ్చారు. పసుపులేరు మంజీరానదికి ఉపనదివంటిది. హరిద్ర, మంజీర, గోదావరి నదులు కందకుర్తివద్ద సంగమించి పెద్దగోదావరినదిగా తెలంగాణాలో ప్రవేశిస్తుంది.
కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యులు మచ్చ ప్రణయ్ కుమార్, బుర్రా సంతోష్  మెదక్ పసుపులేటిలో జరిపిన అన్వేషణలో పాతరాతియుగం నుంచి పెదరాతియుగందాక రాతిపనిముట్లను గుర్తించారు. వీటిలో కొన్ని ఆంత్రోపోమార్ఫిక్ శిలలు కూడా వున్నాయి. పురామానవసాంస్కృతికధారకు ఈ పనిముట్లు సాక్ష్యాలు, ఆధారాలు. నదిలో ప్రవాహానికి కొట్టుకొనివచ్చిన ఈ రాతిపనిముట్లలో ఛెర్ట్ రాతిలో చేసిన పాతరాతియుగం మొన(పాయింట్)రాతిపనిముట్టొకటి ఉన్నది. గతంలో ఠాకూర్ రాజారాం సింగ్ గారి సేకరణలోని పాతరాతియుగం పనిముట్లలో చూసిన పనిముట్టును పోలివున్నది.
ఈ అపురూపమైన రాతిపనిముట్టు పాతరాతియుగంలోని ఎగువపాతరాతియుగానికి చెందినది. ఈ దశలో బ్లేడ్స్ అండ్ బ్యురిన్స్ తయారీ జరిగింది. ఎగువపాతరాతియుగం క్రీ.పూ. 40,000–10,000 సం.లలో కొనసాగిందని చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.