- ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆరా
(ముద్ర ప్రతినిధి -ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): రాజేందర్ నగర్ లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) గోడౌన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయి సందర్శన జరిపారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును కూడా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట రాజేందర్ నగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.