Take a fresh look at your lifestyle.

లాస్య పాఠశాలలో గురు పూజోత్సవం, గోరింటాకు వేడుకలు

మల్యాల,ముద్ర విలేకరి: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని లాస్య ఉన్నత పాఠశాలలో గురువారం గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ రాజు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తుందన్నారు. ఇది శరీరంలోని వేడిని తగ్గించే గుణం కలిగి ఉంటుందని, గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంపొందించి, రక్త ప్రసరణను మెరుగుపరచే లక్షణాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుష్మా, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.