Take a fresh look at your lifestyle.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పోటీలు నిర్వహణ

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్‌కర్నూల్ పట్టణంలోని వాసవి రెసిడెన్సీలో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని చిత్రలేఖనం మరియు జ్ఞాపకశక్తికి సంబంధించిన పోటీలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

క్లాస్మేట్ క్లబ్ నిర్వహిస్తున్న “365 రోజులు ప్రోగ్రాం”లో భాగంగా 127వ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందేలా ఈ పోటీలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ ఫౌండర్ వాస రాఘవేందర్, రాష్ట్ర కార్యదర్శి కె.పి. ప్రసాద్, హకీం రాజేష్, జిల్లా కార్యదర్శులు జ్యోతిరమణి, అర్చన, శ్రీలత, పరమేశ్వర్ పాల్గొన్నారు.

అలాగే పద్మావతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మురళీధర్ రావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి పోటీలను పరిశీలించారు.

కార్యక్రమానికి బహుమతులను నాగర్‌కర్నూల్‌కు చెందిన రాఘవేంద్ర బుక్ స్టోర్ తరఫున సాయి చంద్ర అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.