Take a fresh look at your lifestyle.

ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కల్తీ విత్తనాల పట్టివేత

  • తిరుమలగిరి అడ్డాగా కల్తీ విత్తనాల తయారీ.
  • కల్తీ విత్తనాల పట్టివేతతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.
  • అధికారులు అన్ని మండలాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని కోరుతున్న రైతాంగం.
  • రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తన ఎరువుల రసాయనకే పురుగు మందుల దుకాణాలపై నిఘా ఉంచాలని కోరుతున్న రైతులు.

ముద్ర,తుంగతుర్తి: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారం రోజులు కూడా గడవకముందే తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాల తయారీ కలకలం రేపింది .రైతాంగం ఆరుగాలం కష్టించి లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికొచ్చే దశలో ఇలాంటి నకిలీ విత్తనాలు నకిలీ పురుగుమందులు ఎరువుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. బ్రాండెడ్ లేబుళ్ల పేరుతో విత్తనాల అమ్మకం చేసే వ్యాపారులు రైతుల ప్రాణాలు హరిస్తున్నారు. తమ స్వలాభం కోసం రైతుల కుటుంబాలను ఫణంగా పెడుతున్నారు. నకిలీ విత్తనాలు కారణంగా రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి దివాలా తీసి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్న వ్యాపారుల వైఖరిలో మార్పు రావడం లేదు .అధికారులు తనిఖీ చేసి అప్పుడప్పుడు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అలాగే కొనసాగడం రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో సైతం అనేకమార్లు ఇలాంటి సంఘటనలు జరిగిన నామమాత్రపు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు, నకిలీ పురుగుమందులతో వ్యాపారుల వ్యాపారాలు మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతున్న అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని మాట వినవస్తోంది. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో పలుమార్లు పలు దుకాణాల్లో గతంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి.తమ స్వంత పలుకుబడితో కేసులు కాకుండా సంబంధిత దుకాణదారులు బయటపడ్డారు. విత్తనాల దుకాణాలలో పత్తి విత్తనాలు వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు మొలకలు రాక లబోదిబోమన్న సంఘటనలు ముఖ్యంగా వరి విత్తనాల విషయంలో అనేకమార్లు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం రైతుకు బస్తా ఒడ్లు మొలక రాలేదంటే తిరిగి బస్తా ఇస్తామని మాట అలవాటుగా దుకాణా యజమానులు మార్చుకున్నారు. మొలక రాని వరి విత్తనాలు ఎందుకు తెచ్చారు? రైతులకు ఎందుకు అంటగడుతున్నారని అధికారులు ఎక్కడ కేసులు నమోదు చేయలేదు.అనాదిగా కరువు కాటకాలతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గం ఇప్పుడిప్పుడే వ్యవసాయ రంగంలో గాడిలొ పడుతున్న తరుణంలో నకిలీ విత్తనాల దెబ్బ రైతులు కుంగదీస్తోంది. ఎంత కష్టపడినా ఎంత పెట్టుబడి పెట్టిన పంట దిగుబడి రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు రికార్డ్ డాన్స్ ఉంది .దుకాణ యజమానుల పేరా దుకాణాలు లేకున్నా ఏవోలు గాని ఇంకే వ్యవసాయ శాఖ అధికారి గాని సిఫారసు చేయకుండానే రసాయనకే ఎరువులు పురుగు మందులు రైతులకు అంట కడుతున్నారు. ఒక్కో రైతుకు కలుపు మందుల పేర్లతో ఎకరాకు సుమారు 4000 పైగా కలుపు మందులు అంట కడుతున్నారు. ఒక్కో కలుపుకు ఒక్కో తీరు మందని వారే నిర్ణయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చేయాల్సిన పనిని కూడా దుకాణదారులు నిర్వర్తిస్తున్నారు. దుకాణాల ముందు సూచికల బోర్డులు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి .దుకాణాల్లో ఉండే రసాయనకే ఎరువులు పురుగు మందులు విత్తనాల పేర్లు క్షుణ్ణంగా కనిపించాల్సి ఉంది .దుకాణంలో ఉండే ప్రతి పురుగుమందు స్టాక్ రిజిస్టర్ లో ఎంటర్ చేయాల్సి ఉంది అలాగే వారు అమ్మకం చేసి ప్రతి ఎరువు పురుగుమందు విత్తనాలు వివరాలను సంబంధిత శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంది.మరి వారి దుకాణాల్లో ఉన్న పూర్తి వివరాలు అధికారులకు అందజేస్తున్నారా ?లేక కొన్ని అందజేసి మరికొన్ని నకిలీలను తమ ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారా ?తెలియాల్సి ఉంది.ఖరీఫ్ ప్రారంభం తోనే నకిలీ పత్తి విత్తనాలు పట్టడం అధికారులు కేసు నమోదు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దాడులే మరిన్ని జరిపి రైతులు నష్టపోకుండా చూడాలని వ్యవసాయ అధికారులను యావత్తు రైతాంగం చేతులు జోడించి వేడుకుంటుంది.నకిలీ ఎరువులు పురుగు మందులు విత్తనాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరుతుంది.ఎరువులు పురుగు మందులు అమ్మకం చేసే వ్యాపారులు ఆర్థికంగా బలపడుతుంటే వాటిని ఉపయోగించి పంటలు పండించి అన్నం పెట్టే అన్నదాత మాత్రం రోజురోజుకు ఆర్థికంగా ఎందుకు కృంగిపోతున్నాడు అనే ప్రశ్న యావత్ ప్రజల మదిలో మెదులుతోంది.ఇది వ్యాపారుల గొప్పదనమా లేక రైతు దురదృష్టమా ఏది ఏమైనా అన్నం పెట్టే అన్నదాత రాను రాను వ్యవసాయం అంటే భయపడే స్థితికి తీసుకురావద్దని వ్యవసాయం అంటే పదిమందికి అన్నం పెట్టే రైతన్నకు పండుగ కావాలని అలాంటి పరిస్థితి అధికారులు కల్పించాలని రైతుల కోరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కల్తీ వ్యాపారం తుంగతుర్తి నియోజకవర్గం పేరే వినిపించడం గమనార్హం. ఇకనైనా అధికారులు అప్రమత్తంగా ఉండి కల్తీ వ్యాపారుల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.

  • నకిలీ విత్తనాలు తయారు చేయడానికి ఉపయోగించిన రసాయనాలు డ్రమ్ములు.
  • తయారుచేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు.

 

Leave A Reply

Your email address will not be published.