Take a fresh look at your lifestyle.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలి

  • చేవెళ్ల సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య.
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జడ్జి.

చేవెళ్ల ముద్ర విలేకరి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని చేవెళ్ల సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య గారు తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా చేవెళ్ల కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్‌ ‌జడ్జి దశరథ రామయ్య గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భూతాపం తగ్గించుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు పాండురంగారెడ్డి, బాలస్వామి, మరియు న్యాయవాదులు రాజశేఖర్, రామకృష్ణ, శివరాజ్ ,గిరి, అభిలాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, సిహెచ్.రవీందర్, బి.ఆనంద్, ప్రకాష్, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.