ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ ఫోన్ లు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ మండలంలో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి కోట మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేష్, మండల నాయకులు బబ్బురి పోశెట్టి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు శెట్టి సుమన్ యాదవ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.