ముద్ర, మహదేవపూర్:
జిల్లా ఉపాధ్యక్షులు బి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కేజీబీవీలు సమస్యలకు నిలయముగా మారాయని,ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అధ్యాపకులు, ఇతర సిబ్బంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సమాన పనికి సమాన వేతనం అని చట్టం చేసిన ప్రభుత్వాలే చట్టాన్ని అమలుపరచడం లేదని రాజయ్య అన్నారు. కేజీబీవీ మరియు గెస్ట్ టీచర్ల కు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, 28 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమస్యల పరిష్కారానికై పోరాటమే ఏకైక పరిష్కారం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సంఘాలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రాజయ్య, శ్రీనివాస్,సమ్మయ్య, వెంకటేశ్వర్లు,కిరణ్ కుమార్,వీరేశం, ఆంజనేయులు,అనిత,సరితా దేవి,కళ్యాణి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు