Take a fresh look at your lifestyle.

మంగనూరులో యాదవ సంఘం సభ్యులకు ఘన సన్మానం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ :

బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. సంఘ అధ్యక్షునిగా నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ యాదవ్, సభ్యులుగా కొంగరీ రాములు, జాలం శ్రీనివాస్, సల్ల నాగయ్య, ఆపల్లి సత్తయ్యలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

ఈ సందర్భంగా ఆర్య కటిక సంఘం తరఫున కటిక శ్రీనివాసులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు మరియు సభ్యులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాట్లాడిన వారు, సంఘ సభ్యులు సామాజిక చైతన్యంతో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

గ్రామస్థులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.