రెండేళ్లలో రేవంత్ రెడ్డి పోవాలి..
రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనం…
వారం రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
“రెండేళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలి… ఆయనను ఓడించే సత్తా ఉన్న పార్టీలోనే చేరుతా” అంటూ మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ వారం రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల పట్టణంలో మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆయన స్వగృహంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గతంలో కేసీఆర్ ఓడిపోవాలని ప్రజలు కోరుకున్నారని, అదే విధంగా ఇప్పుడు మళ్లీ మార్పు రావాలని ప్రజల్లో భావన పెరుగుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మార్పు అవసరం ఉందని భావిస్తున్నానని, ఆ మార్పు తీసుకురాగల శక్తి ఉన్న పార్టీలో చేరడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం పదవుల కోసం కాకుండా, రాజకీయంగా ప్రభావం చూపగల వేదికనే ఎంచుకుంటానన్నారు. ఇక పార్టీ మార్పుపై ఊహాగానాలకు తెరదిస్తూ అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత వారం రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తన అభిమానులు, అనుచరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనం…
ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకవడం, కాలేశ్వరంను పునరుద్ధరించకపోవడం సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని జీవన్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు కొట్టుకుపోయింది అని అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ లు ఒక భాగం మాత్రమే అని అన్నారు. మూడు బ్యారేజ్ లు పునరుద్ధరించాలంటే రూ.500 కోట్లు మాత్రమే అయ్యే అవకాశం ఉందని, ప్రాణహిత నది జలాలను వినియోగించునేవిధముగా ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తుమ్మడి హేట్టి వద్ద 152 మీటర్ల నిర్మాణం చేసి, ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లం పల్లికి నీటిని తరలించాలని ప్రయత్నం చేస్తే, 152 మీటర్లు మహారాష్ట్ర అంగీకరించలేదని తెలిపారు. ప్రాణహిత గోదావరి కలిసే చోట 100 మీటర్ల దిగువన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నిర్మాణం చేసి, వినియోగంలోకి తీసుకువచ్చిన గాని నిర్మాణ లోపమా? నిర్వహణ లోపమా? కారణం ఏదైనా పిల్లర్లు కుంగి పోయి, రెండేళ్లు గడిచిపోయాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణకే కాదని, యావత్ రాష్ట్రానికి ఆధారమన్నారు. హైదరాబాద్ దాహార్తి తీర్చడంతో పాటు, పారిశ్రామిక అవసరాలకు,
ముసి ప్రక్షాళన కూడా ప్రాణహిత పై ఆధార పడబోతున్నాం అని అన్నారు. కడెం, ఎస్ ఆర్ ఎస్ పి నుండి 100 టీ ఎం సి లు నీటి లభ్యత ఉండే అవకాశం ఉందని, అదృష్టం కొద్ది వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మడి హేట్టి బ్యారేజ్ తవ్విన కాలువలను రీ డిజైన్ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చిందని, ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. యావత్ తెలంగాణకు ఆధారమైన ప్రాణహిత నది జలాలను వినియోగించుకునేందుకు కనీసం డిజైన్ కూడా రూపొందించలేదని, బడ్జెట్ లో కేవలం రూ.152 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సమర్పించి ఏడాది గడుస్తున్న, మేడిగడ్డ పునరుద్ధరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎదవ చేశారు. మేడిగడ్డ కాంట్రాక్టర్ మరమతు చేసే బాధ్యత ఉందని, కాంట్రాక్టర్ మరమత్తు చేయనట్లయితే రాష్ట్ర ప్రభుత్వమే మరమతులు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని, మేడిగడ్డ పునరుద్ధరణ పై ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బ్యారేజ్ ల నిర్మాణ వ్యయం 8 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. కిషన్ రెడ్డి విమర్శనాత్మకంగా చూడడమే తప్పా నిర్మాణాత్మకంగా నీటిని వినియోగించుకునేల ఆలోచించకపోవడం దురదృష్టకరమని అన్నారు. వాతావరణం అనుకూలించకుంటే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రజల సొత్తు అని అన్నారు. ఎస్ ఎల్ బి సి కుంగిపోయి, కార్మికులు మృతి చెందారని అది వదిలేస్తారా..? అని ప్రశ్నించారు. నిర్మాణం చేసేందుకు ప్రభుత్వ ఆలోచన చేస్తున్నారు కదా, అలాగే మేడిగడ్డ పునరుద్ధరణ గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. విమర్శ ఒక భాగం మాత్రమే కావాలని, విమర్శనే జవాబు కాదు అని, మేడిగడ్డ పునరుద్ధరించాలని, వినియోగంలోకి తీసుకు రావాలని ఆలోచించాలని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్ల లో తుమ్మడి హెట్టీ వద్ద బ్యారేజ్ నిర్మాణం సాధ్యం కాదని, మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టకపోతే దాదాపు 18 లక్షల ఎకరాలు, హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలు తీరేదేలా అని అన్నారు. తక్షణమే ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గంగారెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకం చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తర్వాత అమలు చేయలేదని,
కారణం ఏదైనా నా సహచరుడిని కోల్పోయానని అన్నారు. నేను ఇప్పుడు కాంగ్రెస్ లో లేను.. నా అడ్డు తొలగించుకోవాలని
నామినేటెడ్ పోస్టులు భర్తీ జాప్యం చేసినట్లు కనపడుతుంది అని విలేకరులు ఆడినా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు జున్ను రాజేందర్, పుప్పాల అశోక్, శీలం సురేందర్, దేవేందర్ రెడ్డి, ఇతర నాయకుడు తదితరులు పాల్గొన్నారు