మెట్ పల్లి, ముద్ర: మెట్ పల్లి డివిజన్ మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలోనీ ఎస్సీ కాలనీలోని పబ్లిక్ రోడ్డును కబ్జా చేశారంటూ గ్రామపంచాయతీ ఎదుట కాలనీవాసులు ఆందోళనకు దిగారు, మొగిలిపేట గ్రామంలో సుమారుగా 40 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న పబ్లిక్ రోడ్డును కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారంటూ గత ఏడు నెలల క్రితం నుండి పంచాయతీ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన, దరఖాస్తులు ఇచ్చిన ఎవరూ పట్టించుకోలేదని, ప్రజావాణిలో మొరపెట్టుకున్న మా వాణి ఎవరు వినలేదని, మొగిలిపేట ఎస్సీ కాలనీవాసులు మరియు ఇందిరా గాంధీ దళిత మహిళా సంఘం సభ్యులు గ్రామపంచాయతీ ముందు ఆందోళనకు దిగారు.పంచాయతీ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండానే పబ్లిక్ రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం చేసిన పట్టించుకోవడం లేదని, గోడ నిర్మాణం ఆపండి అని ఎన్ని దరఖాస్తులు ఇచ్చిన పట్టించుకోలేదని వాపోయారు, 40 సంవత్సరాల క్రితం నుండే పబ్లిక్ నడవడానికి డ్రైనేజ్ పైన కల్వర్టు నిర్మించడం జరిగిందనీ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరుపక్కల స్తంభాలు వేసి వైరు లాగడం కూడా జరిగిందని,సగం ఊరు ప్రజలు అదే రోడ్డు వెంట రేషన్ షాప్ లకు వెళ్లేవారమని,బ్యాంకు, బస్టాండుకు వెళ్లేవారమని,అనుమతులు లేకుండా గోడ నిర్మాణం చేయడం వల్ల రోడ్డు లేకుండా పోయిందని బాధ వ్యక్తం చేశారు, అనుమతులు లేకుండా పబ్లిక్ రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను కూల్చివేసి పబ్లిక్ రోడ్డును యధావిధిగా చేసి ఇవ్వాలని గ్రామపంచాయతీ ముందు ఆందోళనకు దిగారు, ఇందులో కాలనీవాసులు ఇందిరా గాంధీ దళిత మహిళ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.