Take a fresh look at your lifestyle.

ఓట్లు వేయలేదంటూ దాడి

 
ముద్ర ప్రతినిధి, భువనగిరి :

భువనగిరి 1వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వలబోజు స్వరూపరాణి ఓటమి తట్టుకోలేక పద్మశాలి కులస్తుల ఇళ్లపై బీరు సీసాలతో దాడులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఇళ్లపై సీసాలు విసిరి, బూతులు తిడుతూ హల్చల్ చేశారన్నారు. పంపిణీ చేసిన చీరలు, హాట్ బాక్స్లను రోడ్డుపై వేసి నిరసన తెలుపుతూ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లారు. వారితో తమకు ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.