Take a fresh look at your lifestyle.

​సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ

ముద్ర కూకట్‌పల్లి :
తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి నిలువుటద్దం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ కొనియాడారు. బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ కమాన్ వద్ద ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ కార్యక్రమంలో హైదరర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ లతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నరు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ మాట్లాడుతూ
​సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి స్ఫూర్తిప్రదాత సర్వాయి పాపన్న.
​ఆనాటి నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను ఏకం చేసి, ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయం.
​బహుజన వర్గాల అభ్యున్నతి కోసం పాపన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలి.
​ఈ కార్యక్రమంలో పాండుగౌడ్, బి.వెంకటేష్ గౌడ్, చంద్రకాంత్ రావు, రాందాస్ గౌడ్, అభి గౌడ్, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, గోపాల్, మల్లేష్, నరసింగ రావు, షౌకత్ అలీ మున్నా, మజర్, ఖాజా, లింగం, సుధాకర్, రాజు గౌడ్, వెంకటేష్ గౌడ్, ఖలీమ్, సత్యనారాయణ, హరీష్, రవీందర్, రాజు, శ్రీను తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.